Advertisementt

అనసూయకి బ్రహ్మాజీ కౌంటర్ ఎటాక్

Wed 31st Aug 2022 11:52 AM
brahmaji,anasuya,fans,social media  అనసూయకి బ్రహ్మాజీ కౌంటర్ ఎటాక్
Brahmaji indirect punch to Anasuya blocks minds అనసూయకి బ్రహ్మాజీ కౌంటర్ ఎటాక్
Advertisement
Ads by CJ

నటుడు బ్రహ్మాజీ అతనికి వయసు పెరిగినా.. గ్లామర్ మాత్రం తగ్గలేదు.. ఇంకా యంగ్ లుక్స్ లోనే హీరోలకి ఫ్రెండ్ కేరెక్టర్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు యాంకర్ సుమ బ్రహ్మాజీ ఏజ్ పై కౌంటర్లు కూడా వేస్తుంది. ఏదైనా ఫన్నీ గా పాజిటివ్ గా తీసుకునే ఆయన ఇప్పుడు టాలీవూడ్ యాంకర్ అనసూయ కి గట్టిగా ఇండైరెక్ట్ కౌంటర్ వెయ్యడం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. అనసూయ ఈ మధ్యన ఓ ట్వీట్ చేసి నెటిజెన్స్ చేతిలో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాన్స్ చేతిలో ట్రోల్ అవడమే కాదు, తనని ఆంటీ అంటూ బాడీ షేమింగ్ చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ లకి కంప్లైంట్ కూడా చేసింది. తనని ఆంటీ అన్నవాళ్ళని ఊరికే వదలను అంటూ ఫైర్ అయ్యింది. 

దీనికి కౌంటర్ గానే బ్రహ్మాజీ ట్వీట్ వెయ్యడం ఇప్పుడు సంచలనం అయ్యింది. సోషల్ మీడియాలో ఫాన్స్ తో చిట్ చాట్ చేసే బ్రహ్మాజీ.. వాట్స్ హ్యాపెనింగ్ అంటూ ట్వీట్ చెయ్యడంతో.. ఆయన ఫాన్స్ ఏం లేదు అంకుల్ అంటూ రీ ట్వీట్ చేయాడంతో.. బ్రహ్మాజీ కూడా అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా? అంటూ ఫన్నీ ఎమోజితో రిప్లై ఇవ్వడం అది కాస్తా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయ్యింది. అయితే బ్రహ్మాజీ కావాలనే ఇండైరెక్ట్ గా అనసూయకి తగిలేలా ఇలాంటి ట్వీట్ చేశాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmaji indirect punch to Anasuya blocks minds:

Brahmaji funny take on Anasuya episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ