పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం జల్సా స్పెషల్ షోస్ అప్ డేట్స్ తోనూ, పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున రాబోతున్న హరి హర వీరమల్లు అప్ డేట్ పై వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. జల్సా షోస్ ప్రీ బుకింగ్ తోనే రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న పవన్ ఫాన్స్.. హరి హర వీరమల్లు అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పవన్ హరి హర వీరమల్లు పోస్టర్ వదులుతూ సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే స్పెషల్ గా సాయంత్రం 5.45 నిమిషాలకి పవర్ గ్లాన్స్ వదలబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. హరి హర వీరమల్లు నుండి రాబోయే పవర్ గ్లాన్స్ 40 సెకన్స్ తో కూడుకున్న వీడియో గా ఉండబోతుంది అని, ఈ గ్లాన్స్ తో పాటుగా పవన్ కళ్యాణ్ వీరమల్లు పోస్టర్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ బర్త్ డే స్పెషల్ గా ఏది వచ్చినా.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి చెయ్యాలని పవన్ ఫాన్స్ ఫిక్స్ అయ్యి ఉన్నారు.