కోలీవుడ్ నటి అమలా పాల్ ప్రస్తుతం తనకి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ పైన కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అమలా పాల్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉన్న హీరోయిన్. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా తర్వాత వివాహబంధానికి విడాకులతో గుడ్ బై చెప్పింది. అప్పటినుండి ఒంటరిగానే ఉంటున్న ఆమెకి మరో బాయ్ ఫ్రెండ్ దొరికాడు. పవీంధర్ సింగ్ తో 2018 లో ఓ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసిన అమలా పాల్ కి పవీంధర్ సింగ్ తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది.
పెళ్ళికి కూడా రెడీ అయిన ఈ జంట గత కొంతకాలంగా కామ్ గా ఉంటుంది. గత ఏడాది అమలా పాల్ - పవీంధర్ సింగ్ ల పెళ్లి ఫొటో లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, తర్వాత వాటిని డిలేట్ చెయ్యడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళకి అమలా పాల్ తన మాజీ ప్రియుడు పవీంధర్ సింగ్ పై వేధింపుల కేసు పెట్టడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. చిత్ర నిర్మాణ సంస్థ లావాదేవీల్లో అమలా పాల్ - పవీంధర్ సింగ్ మధ్యన వచ్చిన విభేదాల కారణంగా వీరిద్దరూ కొద్దిరోజులుగా దూరంగానే ఉంటున్నారు. అయితే అమలా పాల్ మాత్రం తనకి రావాల్సిన డబ్బు పవీంధర్ సింగ్ ఇవ్వకపోగా.. తన ప్రవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో పాటుగా నిర్మాణ సంస్థ డైరెక్టర్గా అమలాపాల్ పేరును తొలగిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి తనని మోసం చేశాడని పోలీసుకు ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది. దానితో పోలీస్ లు అమలా పాల్ మాజీ ప్రియుడు పవీంధర్ సింగ్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లుగా సమాచారం.