ఇప్పుడు స్టార్ హీరోల బర్త్ డే లకి స్పెషల్ షో లకి విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయినట్టు కనిపిస్తుంది. మొన్న మహేష్ బాబు తో ఈ మ్యానియా స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే కి వేసిన పోకిరి స్పెషల్ స్క్రీనింగ్ కి ఫాన్స్ నుంచి ఎక్సట్రార్డినరీ అప్లాజ్ రావడంతో.. ఇప్పుడదే కంటిన్యూ చేస్తూ మొన్న చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22 కి ఘరానా మొగుడు స్పెషల్ షోస్ పడ్డాయి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ బర్త్ డే కి జల్సా స్పెషల్ షోస్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అందరికి తెలిసిందే. నెంబర్ అఫ్ థియేటర్స్ లో నెంబర్ అఫ్ షోస్ కన్ ఫర్మ్ చేసుకుంటూ.. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది జల్సా.
ఇప్పుడిదే కోవలో రెబల్ స్టార్ ఫాన్స్ కూడా రచ్చ చేసేందుకు రంగం రెడీ అవుతుంది. ప్రభాస్ డ్యూయెల్ రోల్ తో, ప్రభాస్ ని మోస్ట్ స్టైలిష్ అవతార్ లో చూపించిన బిల్లా సినిమా 4K ప్రింట్ రెడీ చేస్తున్నారు. ఆ రోజుల్లోనే క్వాలిటీ వైస్ గా, టెక్నీకల్ గా, విజువల్ గా ఎక్సట్రార్డినరీ అనిపించిన బిల్లా.. ఇప్పుడు 4K క్వాలిటీ లోకి చేసాక ఇంకెంత క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే ప్రభాస్ స్టైలిష్ పెరఫార్మెన్స్ కి అనుష్క బికినీ అందాలు యాడ్ అవుతున్నాయి. రాధే శ్యామ్ తో డిస్పాయింట్ అయ్యి ఆదిపురుష్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫాన్స్ కి ప్రభాస్ బర్త్ డే రోజున రచ్చ చేసే అవకాశాన్నిస్తుంది బిల్లా.