Advertisementt

రామ్ చరణ్ చేతిలో కొత్త కంపెనీ

Tue 30th Aug 2022 12:14 PM
ram charan,bike company,rc 15  రామ్ చరణ్ చేతిలో కొత్త కంపెనీ
Ram Charan endorsing a bike company రామ్ చరణ్ చేతిలో కొత్త కంపెనీ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో పలు ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా చేసే హీరోల్లో అల్లు అర్జున్, మహేష్ బాబు ముందుంటారు. అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా చిత్రం తర్వాత వరసగా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా క్రేజీ యాడ్స్ లో కనిపిస్తున్నాడు. మహేష్ కూడా అంతే.. సినిమాలకన్నా ఎక్కువగా యాడ్స్ షూట్ లే చేస్తుంటాడు. ఇక రామ్, చరణ్ కూడా సువర్ణభూమి, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి కమర్షియల్ యాడ్స్ లో నటించాడు. ట్రిపుల్ ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు.

ప్రముఖ బైక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న RC15 షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఈ బైక్ కంపెనీ యాడ్ షూట్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ యాడ్ షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ యాడ్ కోసం రామ్ చరణ్ భారీ మొత్తంలో పారితోషకం అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

Ram Charan endorsing a bike company:

Ram Charan endorsing a bike company

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ