Advertisementt

సితారతో కలిసి మహేష్ అలా..

Tue 30th Aug 2022 11:19 AM
mahesh babu,dance india dance promo,zee telugu  సితారతో కలిసి మహేష్ అలా..
Mahesh Babu Dance India Dance promo goes viral సితారతో కలిసి మహేష్ అలా..
Advertisement
Ads by CJ

మహేష్ బాబు కి కూతురు సితార అంటే ఎంత ఇష్టమో వారు చేసే అల్లరి, వారు దిగే ఫొటోస్ రూపంలో చూస్తూనే ఉంటాం. తన అమ్మ ఇందిర రూపంలో పుట్టిన కూతురు సితార అంటే మహేష్ కి వల్లమాలిన ఇష్టం. ఇక కొడుకు గౌతమ్, కూతురు సితార విషయంలో మహేష్ ఎంతో కేరింగ్ గా ఉంటారు. అయితే సితార మహేష్ బాబు కూతురిగా స్టార్ కిడ్ గా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న అమ్మాయి. సితార కేవలం మహేష్ డాటర్ గానే కాదు, తనకంటూ ఓ టాలెంట్ ఉన్న అమ్మాయి. యూట్యూబ్ ఛానల్, అలాగే తండ్రి సినిమాల్లో క్రేజీ సాంగ్స్ కి వేసే డాన్స్ స్టెప్స్ అన్ని సితార కి క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. అలాగే కూచిపూడి డాన్స్ ఇలా తన ప్రత్యేకతని చూపిస్తుంది సితార.

సితార సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్ సాంగ్ పెన్నీ సాంగ్ తో మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. మంచి డాన్సర్ అయిన అయిన సితార తో మహేష్ బాబు జీ తెలుగులో ప్రసారం కాబోతున్న డాన్స్ ఇండియా డాన్స్ కి గెస్ట్ గా వచ్చారు. కూతురు సితార తో కలిసి ఎంతో స్టైలిష్ గా మహేష్ డాన్స్ ఇండియా డాన్స్ కి వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కూతురు సితార తో కలిసి ఇలాంటి ఓ డాన్స్ షోకి రావడం చాలా అందంగా ఉంది అంటూ మహేష్ చెప్పడం, ఆ ప్రోమో లో సితార వేసిన డాన్స్ అన్ని హైలెట్ అయ్యాయి.

Mahesh Babu Dance India Dance promo goes viral:

Mahesh Babu Dance India Dance promo mesmerise

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ