అఖండ లాంటి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న యాక్షన్ ప్యాకెడ్ మూవీ NBK107. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రాన్ని బాలకృష్ణ క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే కి విడుదలైన NBK107 టీజర్, బాలకృష్ణ మాస్ పవర్ ఫుల్ లుక్ బాలయ్య ఫాన్స్ కి కిక్ ఇస్తే.. సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఫీలయ్యాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం బాలకృష్ణ హీరోయిన్ శృతి హాసన్.. మూవీ టీం కలిసి టర్కీ కి వెళుతుంది. టర్కీ లో ఓ సాంగ్, ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేస్తుంది.
అయితే ఈ చిత్రాన్ని దసరా బరిలో చిరు-నాగ్ లపై వదులుతారని ఫాన్స్ భావించినా.. ఈ చిత్రానికి సంబందించిన మేజర్ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో.. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా క్రిష్ట్మస్ సెలవలని టార్గెట్ చేస్తూ డిసెంబర్ 23 న NBK107 రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. అంటే 24 క్రిష్ట్మస్ ఈవ్, అలాగే 25th క్రిష్టమస్, 26 బాక్సింగ్ డే ఇలా లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది అని NBK107 ని డిసెంబర్ 23 నే రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.