Advertisementt

హరి హర వీరమల్లు సర్ ప్రైజ్ ఇదే...

Mon 29th Aug 2022 09:56 PM
hari hara veera mallu,pawan kalyan,krish  హరి హర వీరమల్లు సర్ ప్రైజ్ ఇదే...
Special update on Hari Hara Veeramallu హరి హర వీరమల్లు సర్ ప్రైజ్ ఇదే...
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ రచ్చ రచ్చ చెయ్యడమే కాదు, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు అప్ డేట్ రాబోతుంది అంటూ #HariHaraVeeramallu హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. గత రెండు రోజులుగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా సెప్టెంబర్ 2 న రాబోతుంది అని హడావిడి మొదలైంది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు కోసం కత్తి సాము, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఇప్పుడు రాబోయే యాక్షన్ టీజర్ లో పవన్ యుద్ధ విన్యాసాలు ఉండబోతున్నాయంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తప్ప మరే సినిమా అంటే హరీష్ శంకర్ మూవీ నుండి కానీ, సురేందర్ రెడ్డి మూవీ నుండి కానీ, సముద్ర ఖనితో చెయ్యబోయే రీమేక్ నుండి అప్ డేట్ వచ్చే అవకాశం లేదు. 

కారణం గత ఏడాది ఏదోలా అప్ డేట్స్ ఇచ్చి ఫాన్స్ ని కూల్ చేశారు. తర్వాత వాటికి సంబందించిన ఏ ఒక్క విషయము ముందుకు కదల్లేదు. సో వాటి అప్ డేట్స్ ని ఫాన్స్ ఆశించలేరు. కానీ హరి హర వీరమల్లు పైనే ఫాన్స్ ఎదురు చూపులు. అయితే మేకర్స్ నుండి పవన్ బర్త్ డే కి స్పెషల్ సర్ ప్రైజ్ అంటూ ఎలాంటి ప్రకటన రాపోయేసరికి అందరిలో అనుమానం ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే రోజున హరి హర వీరమల్లు నుండి స్పెషల్ పోస్టర్ తో పాటుగా ఓ 40 సెకన్ల టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ 40 సెకన్ల టీజర్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ ని పవన్ ఫాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. అది విన్న పవన్ ఫాన్స్.. సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. మరోపక్క జల్సా స్పెషల్ షోస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Special update on Hari Hara Veeramallu :

Hari Hara Veera Mallu video glimpses are loading

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ