Advertisementt

వారిద్దరూ బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Mon 29th Aug 2022 06:11 PM
udaya bhanu,bigg boss 6,deepika pilli  వారిద్దరూ బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
Udaya Bhanu and Deepika Pilli Rejects Bigg Boss Offer? వారిద్దరూ బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ 6 కి కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తవడమే కాదు, ఇప్పటికే వారిని హైదరాబాద్ లోని రెండు మూడు హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసి మరీ క్వారంటైన్ కి పంపినట్టుగా తెలుస్తుంది. కరోనా ప్రభావం తీవ్రంగా లేకపోయినా.. హౌస్ లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ప్రోబ్లెంస్ ఫేస్ చేయాల్సి వస్తుందని ముందుగానే యాజమాన్యం కంటెస్టెంట్స్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దారని తెలుస్తుంది. శనివారమే గ్రాండ్ ఓపినింగ్ ఎపిసోడ్ ద్వారా కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారని.. దానిని ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారు.

హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అందులో ఉదయభాను, దీపికా పిల్లి, ఇనయ సుల్తానా, బాలాదిత్య, యూట్యూబర్‌ ఆదిరెడ్డి, గలాటా గీతూ, సుదీప, జబర్దస్త్‌ చలాకీ చంటి, నటుడు శ్రీహాన్‌, సింగర్‌ రేవంత్‌, వాసంతి కృష్ణన్‌, శ్రీసత్య, యాంకర్‌ ఆరోహి రావు, తన్మయ్‌, బుల్లితెర జోడి రోహిత్‌-మెరీనా అబ్రహం, కామన్‌ మ్యాన్‌ రాజశేఖర్‌, అర్జున్‌ కల్యాణ్‌ లు హౌస్ లోకి వెళ్లే పేర్లుగా ఆ లిస్ట్ చెబుతుంది. అయితే బిగ్ బాస్ మొదలయ్యే చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాలతో యాంకర్ ఉదయభాను, దీపికా పిల్లి లు బిగ్ బాస్ నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అగ్రిమెంట్ పూర్తయినా, భారీ పారితోషకం ఇస్తామని చెప్పినా.. వారిద్దరూ ఈ షో కి హ్యాండ్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్.

Udaya Bhanu and Deepika Pilli Rejects Bigg Boss Offer?:

Udaya Bhanu Rejects Bigg Boss Offer?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ