పూరి కనెక్ట్స్ పేరుతొ పూరి జగన్నాథ్- ఛార్మి కలిసి నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూరి దర్శకత్వంలో ఛార్మి నిర్మాతగా పూరి కనెక్ట్స్ నడుస్తుంది. ఇప్పుడు ఈ పూరి కనెక్ట్స్ - కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో పూరి, ఛార్మి లు లైగర్ మూవీ చేశారు. లైగర్ పై ఉన్న కాన్ఫిడెంట్ తో 200 కోట్ల మేర ఓటిటి డీల్ వచ్చినా అమ్మకుండా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యగా.. సౌత్ లో లైగర్ మొదటిరోజే చేతులెత్తేసింది. హిందీలో ఓ మాదిరిగా ఆడుతున్న లైగర్ మూవీ ని ఓటిటికి అమ్మేసుకుంటే 200 కోట్లు వచ్చేవి.. కాని అతి నమ్మకమే ఛార్మి బ్యాచ్ కొంప ముంచింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఛార్మి కౌర్ లైగర్ డిసాస్టర్ పై స్పందించింది.
ప్రస్తుతం ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కొద్దిపాటి ఖర్చుతోనే ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. అందుకే థ్రిల్ అనిపించకపోయినా, వారు గనక ఎగ్జైట్ అవకపోతే థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. టాలీవుడ్ లో రీసెంట్ గా బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలు 150 నుండి 170 కోట్ల కలక్షన్స్ వసూలు చేసాయి. కానీ బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 2019 నుండి లైగర్ కోసం కష్టపడ్డాం. ఎన్నో అడ్డంకులు దాటి మూడేళ్ళ తర్వాత సినిమాని థియేటర్‌లో విడుదల చేశాం. కానీ లైగర్ ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది అంటూ ఛార్మి లైగర్ ఫెయిల్యూర్ పై స్పందించింది.