అల్లు అర్జున్ - సుకుమార్ క్రేజీ పాన్ ఇండియా మూవీ పుష్ప ద రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. పుష్ప ద రూల్ పై ట్రేడ్ లోనే కాదు, పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఆచి తూచి పుష్ప పార్ట్ 1 విడుదలైన ఎనిమిది నెలలకి పుష్ప పార్ట్ 2 ని పట్టాలెక్కించారు సుకుమార్ అండ్ బన్నీ లు. పుష్ప ద రైజ్ సక్సెస్ లో దేవిశ్రీ మ్యూజిక్ మెయిన్ హైలెట్ అయ్యింది. ఇప్పటికీ ఆ సాంగ్స్ క్రికెట్ మైదానంలోనూ, పెళ్లిళ్లలో ఇలా అన్నిచోట్లా మోగుతూనే ఉన్నాయి. ఐటెం సాంగ్ అయితే భీభత్సమే. ఉ అంటావా మావా సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది. అందుకే పార్ట్ 2 మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా అంచనాలు మొదలయ్యాయి. తాజాగా దేవిశ్రీ పుష్ప ద రూల్ పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.
పుష్ప ద రైజ్ చిత్రం ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది. పుష్ప ఇప్పుడు గ్లోబల్ సినిమాగా గుర్తింపు పొందింది. పుష్ప2 అంతకుమించి అనేలా ఉంటుంది. సుకుమార్ పార్ట్ 2 కోసం రాసిన కథ నెక్ట్స్ లెవల్లో ఉంది. నన్ను చాలా ఎగ్జైట్ చేసిందీ కథ. మైండ్ బ్లోయింగ్ అనేలా పుష్ప ద రూల్ కథ ఉంటుందని చెప్పగలను. నేను పుష్ప కి సంగీత దర్శకుడిగా కాకుండా సినిమా లవర్‌గా చెబుతున్నాను.. అంటూ పుష్ప పార్ట్ 2 పై దేవిశ్రీ ఇచ్చిన అప్ డేట్ అల్లు ఫాన్స్ కి అమృతంలా వినిపించడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.