మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా మొదలుకాబోతున్న SSMB28 సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో చేసినా.. రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం ఆలస్యం అవుతూనే వస్తుంది. జూన్ లోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సినా ఇప్పుడు ఆగష్టు నెల కూడా పూర్తయ్యింది.. ఇంతవరకు మొదలు కాలేదు. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టకుండానే మేకర్స్ SSMB28 విడుదల తేదీ ప్రకటించి షాకిచ్చారు. ఏప్రిల్ 28 2023 న రిలీజ్ అని చెప్పారు. మరి మహేష్ బాబు-త్రివిక్రమ్ ఇద్దరూ చాలా నెమ్మదిగా షూటింగ్ చేస్తారు. కానీ ఇలా ఎనిమిది నెలల గ్యాప్ లోనే విడుదల తేదీ ప్రకటించడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది.
అదలా ఉంటే ఆగష్టు నెల చివరి నుండి మొదలవుతుంది అనుకున్న SSMB28 రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా స్టయిల్లో ఈ మూవీ తెరకెక్కి హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించబోతున్నారని, అలాగే ఫిట్ నెస్ లోను మహేష్ మేకోవర్ కొత్తగా ఉండబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో పూజ హెగ్డే తో మహేష్ రెండోసారి రొమాన్స్ చేస్తున్నాడు.