Advertisementt

ప్రభాస్-మారుతి కాంబో స్టోరీ అదేనా?

Mon 29th Aug 2022 10:27 AM
prabhas,director maruthi,prabhas-maruti combo  ప్రభాస్-మారుతి కాంబో స్టోరీ అదేనా?
Prabhas-Maruti story revealed? ప్రభాస్-మారుతి కాంబో స్టోరీ అదేనా?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిన్న దర్శకుడు, ప్లాప్ దర్శకుడు మారుతి తో సినిమా మొదలు పెట్టడం ప్రభాస్ ఫాన్స్ కి నచ్చకపోయినా.. ప్రభాస్ మారుతి తో సినిమా మొదలు పెట్టడమే కాదు.. త్వరలోనే మారుతీ మూవీ సెట్స్ లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గానే కొబ్బరికాయ కొట్టిన ప్రభాస్ - మారుతి మూవీ నవంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్లొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మొత్తం ఓ ఇంటి సెట్ లోనే ఉండబోతుంది అని, మేజర్ పార్ట్ షూటింగ్ ఆ కాస్ట్లీ ఇంటి సెట్ లో ప్లాన్ చేశారట. అందుకోసమే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో థియేటర్‌ సెట్‌ను, అలాగే ఓ ఇంటి సెట్ రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్‌.

అయితే తాజాగా ప్రభాస్-మారుతి సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టబోతున్నారని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూస్. ఇప్పుడు ఈ సినిమా కథ గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్‌ అనే థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అంటున్నారు. అందుకోసమే ఆ థియేటర్ సెట్ కూడా వేయిస్తున్నారట. ఈ సినిమాకి ప్రభాస్ చాలా తక్కువ రోజుల డేట్స్ మాత్రమే ఇవ్వగా.. మారుతి కూడా రెండు మూడు షెడ్యూల్స్ లోనే ఈ మూవీ కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారట.

Prabhas-Maruti story revealed?:

Prabhas film with director Maruthi to go on floors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ