పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు సినిమా అప్ డేట్ పై పవన్ ఫాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో మే నెలలో ఆగిన వీరమల్లు షూటింగ్ మళ్ళీ ఇంతవరకు మొదలు కాలేదు. మధ్యలో హరి హర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది అనే ప్రచారం జరిగింది. దర్శకుడు క్రిష్ పనితనంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడనే న్యూస్ నడిచింది. అలాగే హరి హర వీరమల్లు షూటింగ్ పక్కనబెట్టిన పవన్ మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ లో హిట్ అయిన వినోదియ సీతం మూవీని రీమేక్ చేస్తున్నారు.. ఆ సినిమా అధికారికంగా కూడా మొదలయ్యింది. దానితో హరి హర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది అనుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తుండడంతో.. క్రిష్ హరి హర వీరమల్లు నుండి పవన్ కళ్యాణ్ కి సెప్టెంబర్ 2 న బర్త్ డే విషెస్ చెబుతూ.. ఓ యాక్షన్ టీజర్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ యుద్ధ విన్యాసాలను చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.