Advertisementt

అన్ స్టాపబుల్ 2 ఎప్పుడు బాలయ్యా..

Sat 27th Aug 2022 10:30 PM
balakrishna,unstoppable 2,aha ott  అన్ స్టాపబుల్ 2 ఎప్పుడు బాలయ్యా..
Aha Announces Unstoppable Season 2 with Balakrishna అన్ స్టాపబుల్ 2 ఎప్పుడు బాలయ్యా..
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలయ్య ఫస్ట్ టైం ఓ టాక్ షో చెయ్యడం అది సూపర్ బ్లాక్ బస్టర్ అవడం చూసాం. అల్లు అరవింద్ ఆహా కోసం బాలయ్య బాబు అన్ స్టాపబుల్ టాక్ షో తో సరికొత్త రికార్డులు సృష్టించారు. మోహన్ బాబు దగ్గర నుండి రాజమౌళి వరకు పలువురు సెలబ్రిటీస్ ని తన టాక్ షో లో ఓ ఆట ఆడించారు బాలయ్య. అంతేకాకుండా ఆడియన్స్ తో బాలయ్య చేసిన చిలిపి అల్లరి షో కి హైలెట్ అయ్యి.. ఆహా ని అందలం ఎక్కించింది. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీజన్ 2 పై అందరిలో అమితాసక్తి మొదలయ్యింది. 

ఆగష్టు నుండే అన్ స్టాపబుల్ సీజన్ 2 అన్నప్పటికీ.. ఇప్పటివరకు ఆహ నుండి ఆ ఊసే లేదు. బాలయ్య అన్ స్టాపబుల్ అతి త్వరలోనే అంటూ ప్రకటించారు కుడా.. ఇక ఆగష్టు నుండి బాలకృష్ణ ని అన్ స్టాపబుల్ స్టేజ్ పై చూడొచ్చు అనుకున్న ఫాన్స్ కి ఈ నెల ఎండ్ అవడంతో నిరాశే మిగిలింది. సెప్టెంబర్ లో అయినా మొదలవుతుందో.. లేదో.. అనే బెంగలో నందమూరి ఫాన్స్ ఉన్నారు. మరి ఎప్పుడు మొదలయినా అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరు నే అంటున్నారు. బాలయ్య-చిరు ఒకే స్టేజ్ పై.. దాని కోసమే మెగా-నందమూరి ఫాన్స్ వెయిటింగ్.. ఆహా ఆ సంగతేమిటో చూడు అంటూ ఫాన్స్ రిక్వెస్ట్ లు ఎక్కువయ్యాయి.

Aha Announces Unstoppable Season 2 with Balakrishna:

Balayya Unstoppable 2 Treat From?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ