అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ లో లాంచ్ చెయ్యాలనే కోరిక చాలామంది దర్శకుల్లో ఉంది. మరీ ముఖ్యంగా పూరి జగన్నాధ్ కి ఉంది. అటు జాన్వీ కపూర్ కూడా సౌత్ లో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లతో నటించాలనే కోరికను కూడా బయట పెట్టింది. ఇక తన దగ్గరకు మంచి స్క్రిప్ట్ వస్తే సౌత్ లో సినిమా చేసేందుకు రెడీ అంటున్న జాన్వీ కపూర్ ని లైగర్ సినిమా కథ అనుకున్నప్పుడు విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనుకుని.. తన అభిమాన తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ కి లాంచ్ చేసే అదృష్టం పొందాలనుకున్న పూరికి జాన్వీ కపూర్ డేట్స్ ఖాళీ లేవు అంటూ లైగర్ ప్రాజెక్ట్ కి నో చెప్పిందట.
ఈ విషయం పూరి లైగర్ ప్రమోషన్స్ అప్పుడే చెప్పాడు. అందుకే జాన్వీ కపూర్ ప్లేస్ లోకి కరణ్ జోహార్ చెప్పాడని అనన్య పాండే ని తీసుకొచ్చారు. మరి లైగర్ లో అనన్య పాండే మెయిన్ మైనస్ అని, ఆమె గ్లామర్ కన్నా ఆమె కేరెక్టర్ ఇరిటేట్ చేసింది అంటూ రౌడీ ఫాన్స్ ఆగ్రహించారు కూడా. లైగర్ సినిమా కొచ్చిన టాక్, అలాగే అనన్య కి వచ్చిన పేరు చూసాక ఈ సినిమా జాన్వీ కపూర్ చేయకపోవడమే మంచిదైంది.. లేదంటే సౌత్ లోకి డిసాస్టర్ తో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చేది అంటూ శ్రీదేవి అభిమానులు కూల్ అవుతున్నారు.