ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. సౌత్ సినిమాల హావా ని తట్టుకుని బాలీవుడ్ షేక్ అయ్యే సినిమాని తీసుకురావడానికి స్టార్ హీరోలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. అటు పరాజయాల పరాభవం, ఇటు నెటిజెన్స్ బాయ్ కాట్ బాలీవుడ్ హాష్ టాగ్స్ తో చాలా మధనపడిపోతున్నారు. అర్జున్ కపూర్ లాంటి వాళ్ళు బాయ్ కాట్ బాలీవుడ్ పై యుద్ధం చేద్దామంటే, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే బాలీవుడ్ బాగుపడుతుంది అన్నారు. తాజాగా సునీల్ శెట్టి కూడా బాలీవుడ్ లోని ప్రస్తుత పరిస్థితులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సునీల్ శెట్టి ని మీడియా బాయ్ కాట్ బాలీవుడ్ పై స్పందించమని కోరింది.
ప్రస్తుతం ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాల పట్ల, కథల పట్ల సంతృప్తిగా లేరు. గతంలో మేము ఎన్నో మంచి సినిమాలు చేసాం. కానీ ఇప్పుడొచ్చే కథల పట్ల ప్రేక్షకులు సుముఖంగా లేరు. అందుకే బాలీవుడ్ కి ఈ పరిస్థితి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఎందుకు ఇలా జరుతుందనే దానిని గురించి నేను కూడా కచ్చితంగా చెప్పలేను. ఒకప్పుడు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా, టీవీనే., కానీ ఇప్పుడు ఓటిటీలు వచ్చేసాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇలా, 4జీ టెక్నాలజీ రావడం, డేటా చార్జీలు దిగి రావడం, కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఇవన్నీ ప్రేక్షకులని థియేటర్స్ కి దూరం చేసాయి. బాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియా వైడ్ గా సినిమాపై ఈ ప్రభావం పడింది అంటూ సునీల్ శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితులపై స్పందించారు.