విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ నిన్ననే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ తన మీదున్న ఫాన్స్ అభిమానం చూసి మా అయ్యా తెల్వడు, మా తాత తెల్వడు, నా మీద ఎందుకింత అభిమానం అంటూ రెచ్చిపోవడమే కాదు, ఓ సందర్భంలో లైగర్ మూవీ కి 200 కోట్ల ఓటిటి డీల్ వచ్చింది, కానీ థియేటర్స్ లో రిలీజ్ చేసి అంతకన్నా ఎక్కువ తేగల సత్తా ఉంది అంటూ మాట్లాడాడు. అంతేకాకుండా #BoyCottLigerMovie హాష్ టాగ్ ని ఛాలెంజ్ చేస్తూ బాన్ చేస్తే చేసుకోండి అంటూ మాట్లాడాడు. ఇప్పుడవే వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ మెడకి చుట్టుకున్నాయి. లైగర్ టాక్ చూసిన నెటిజెన్స్ దేవరకొండ ని ఆడుకుంటున్నారు. అతి నమ్మకం, అంత యాటిట్యూడ్ పనికిరాదు విజయ్ కి అంటున్నారు.
కానీ విజయ్ లైగర్ ని కొన్న ఓ థియేటర్ యజమాని విజయ్ దేవరకొండ పై ఫైర్ అవుతున్నాడు. నువ్వు దేవరకొండవి కాదు అనకొండవి అంటూ రెచ్చిపోయి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మల్టీప్లెక్స్ ఓనర్ మనోజ్ దేశాయ్.. సినిమాని బాన్ చేసుకోమంటూ పోటుగాడిలా ఛాలెంజ్ చేసావు. నువ్విచ్చిన స్టేట్మెంట్ల వల్ల థియేటర్ లో టికెట్ బుకింగ్స్ తగ్గిపోయాయి. ఒక్క టిక్కెట్ కూడా తెగని పరిస్థితి. నువ్వు దేవరకొండవి కాదు అనకొండవి. గతంలో నీలాగే ఎగిరింది హీరోయిన్ తాప్సి. కానీ తర్వాత ఏమైంది.. రోడ్ మీదికి వచ్చేసింది. దయచేసి పాలిటిక్స్ కు దూరంగా ఉండండి.. ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి సినిమాలని చంపెయ్యకండి, దాని వలన నిర్మాతలు నష్టపోరు. సినిమాలు కొన్న బయ్యర్లు బోరుమంటారు అంటూ ఆయన విజయ్ దేవరకొండ పై విరుచుకుపడుతున్నారు.