ఈమధ్యన బన్నీ అనడం కన్నా బ్రాండ్ బాబు అని పిలవడం కరెక్ట్ ఏమో అనేలా ఉంది అల్లు అర్జున్ వ్యవహారం. పుష్ప ద రైజ్ పాన్ ఇండియా మూవీ క్రేజ్ తో వరసగా పలు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ కోట్లు వెనకేసుకుంటున్నాడు. పుష్ప ద రైజ్, పుష్ప ద రూల్ కి మధ్యలో అల్లు అర్జున్ రాపిడో, జొమాటో, అభి బస్ రీసెంట్ గా పైప్స్ యాడ్, అలాగే సుకుమార్ తో మరో యాడ్, త్రివిక్రమ్ తో కమర్షియల్ యాడ్స్ చేసిన బన్నీ చేతిలోకి మరో యాడ్ వచ్చి పడింది. అదే పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన KFC యాడ్.
ప్రముఖ ఫుడ్ కంపెనీ అయిన కేఎఫ్సీ తన బ్రాండ్ పబ్లిసిటీ కోసం అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకుంది. ఈ యాడ్ షూట్ కూడా ఫినిష్ అయ్యింది. ఈ KFC అడ్వటైజింగ్ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ KFC యాడ్ లో మనకు కన్నీళ్లు అంటే పడవు. ఘాటు ఎక్కువైనా సరే.. ఎమోషన్లో వచ్చినా, ఘాటు ఎక్కువై వచ్చినా.. తక్కువ లేదు.. ఎక్కువ కాదు కారం.. అంటూ అల్లు అర్జున్ తనకి పాన్ ఇండియా ఇమేజ్ ని తెచ్చిన పుష్ప రాజ్ స్టైల్లో చెప్పై డైలాగ్, అల్లు అర్జున్ హ్యాండ్సమ్ లుక్అన్ని అదిరిపోయాయంతే. అందుకే అనేది బన్నీ బాబు కాదు, బ్రాండ్ బాబు అని.