పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డిసాస్టర్ డైరెక్టర్ మారుతి సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు అనగానే.. మారుతి ని సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తో ప్రభాస్ ఫాన్స్ ఆడేసుకున్నారు కాదు భయపెట్టేసారు. మారుతి ని టాలీవుడ్ నుండి బాన్ చెయ్యాలంటూ హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ నానా హంగామా సృష్టించారు. ప్రభాస్ అసలే సాహో, రాధే శ్యామ్ ప్లాప్స్ తో ఉన్న టైం లో ప్లాప్ డైరెక్టర్ మారుతీ కి ఎలా అవకాశం ఇస్తారు.. మారుతి, ప్రభాస్ తో సినిమా చెయ్యొద్దు, అన్నా ఒక్కసారి ఆలోచించు ప్రభాస్ అన్నా అంటూ ప్రభాస్ ఫాన్స్ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అయితే నిన్న గురువారమే మారుతి-ప్రభాస్ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అన్నారు.
నిజంగానే అనుకున్నట్టుగా ఈ గురువారమే ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టేసారు అని తెలుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ సినిమా మొదలైపోయింది. ఎటువంటి ప్రకటన కానీ, ఒక్క ఫోటో కానీ వదలకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాని మొదలు పెట్టేసారు. అయితే ఇలా సైలెంట్ గా ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ మొదలవడానికి కారణం ట్రోల్స్ కి భయపడి, ప్రభాస్ ఫాన్స్ చేసే మీమ్స్ కి భయపడి అలా చేశారనే టాక్ వినిపిస్తుంది. మరి ఫాన్స్ చేసే ట్రోల్స్ కి భయపడితే రేపు పబ్లిసిటీ చెయ్యాలన్నా ఏం చేస్తారో.. అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.