విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన లైగర్ నిన్న గురువారం విడుదలైంది. తనని అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ ని చేసిన ఆగష్టు 25 నే లైగర్ ని రిలీజ్ చేసి పాన్ ఇండియా స్టార్ అవుదామనుకున్న విజయ్ దేవరకొండ కి లైగర్ టాక్ షాకిచ్చింది. భారీ అంచనాల నడుమ భారీగా రిలీజ్ అయిన లైగర్ మూవీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యింది. ఒక్క విజయ్ దేవరకొండ పెరఫార్మెన్స్, ఆయన లుక్స్ తప్ప .. లైగర్ సినిమాలో చూసేందుకు ఏమి లేదు అంటూ సినిమా చూసిన ఆడియన్స్ తేల్చేస్తున్నారు. మార్నింగ్ షో కే లైగర్ విషయం తేలిపోవడంతో క్రిటిక్స్ కూడా లైగర్ పై విమర్శలు గుప్పిస్తూ రివ్యూస్ ఇవ్వడంతో.. చివరికి లైగర్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఎంతో నమ్మకంతో ఉన్న ఛార్మి, పూరి జగన్నాధ్ లకి లైగర్ భీభత్సమైన షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
మరి లైగర్ రిలీజ్ కి ముందే ఓవర్ కాన్ఫిడెంట్ తో విజయ్ దేవరకొండ పూరి తో కలిసి మరో ప్రాజెక్ట్ జన గణ మన స్టార్ట్ చేసేసాడు. ఇప్పటికే హీరోయిన్ పూజ హెగ్డే తో కలిసి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసేసారు. లైగర్ పక్కా హిట్.. సో జన గణ మన ని మొదలు పెడితే ఆ క్రేజ్ వేరే లెవల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు లైగర్ ఇచ్చిన షాక్ తో పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ లు జన గణ మన తో ముందుకు వెళతారా.. అనే అనుమానాలు రేజ్ అయ్యాయి. జన గణ మన మరో షెడ్యూల్ మొదలయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు పెరుగుతాయి కానీ తగ్గవనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.