విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టయిల్లో ప్రమోషన్స్ చేసి.. లైగర్ పక్కా హిట్ అంటూ భీభత్సమైన నమ్మకంతో బాక్సాఫీసు రింగ్ లోకి దిగితే.. ఆడియన్స్ విజిల్స్, కేకలు వేస్తూ ఎంజాయ్ చెయ్యాల్సింది పోయి.. సినిమా సగంలో థియేటర్స్ నుండి పరుగులు పెడుతున్నారు అంటూ లైగర్ ట్రేడ్ రిపోర్టులు చెబుతుంటే.. ఫాన్స్ ఎంతోకొంత విజయ్ దేవరకొండ కేరెక్టర్ చూసి సర్దుకుపోతుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం లైగర్ చూసి తమదైన శైలిలో ఫన్నీ గా రివ్యూలు ఇస్తున్నారు. ఎంతో యాటిట్యూడ్ చూపించిన విజయ్ దేవరకొండ కి లైగర్ దెబ్బ మాములుగా తగల్లేదు, పాపం పూరి ఆస్తులమ్మి సినిమా చేస్తాడు. అటు దర్శకత్వ లోపం, ఇటు నిర్మాతగా లాస్ అంటూ నెటిజెన్స్ తెగ ఫీలైపోతున్నారు.
ఇక లైగర్ కి వెళ్ళిన ఓ కామన్ ఆడియెన్ ఫన్నీ గా లైగర్ కి ఇచ్చిన రివ్యూ చూస్తే నవ్వాపుకోలేరు.
లైగర్ రివ్యూకి నా రేటింగ్.. 0/5
పాజిటివ్స్
కార్ పార్కింగ్ టైం
స్టార్ట్ టైటిల్స్
స్మోకింగ్ యాడ్స్
ఇంటర్వెల్ గాప్
ఎండ్ టైటిల్స్
నెగెటివ్స్
ఫుల్ లైగర్ మూవీ
ఆఖరికి మెగా డిసాస్టర్ మూవీ #LigerMovie ఇలా ఉన్నాయి కామన్ ఆడియన్స్ లైగర్ ని చూసి కామెంట్స్ చేసే పోస్ట్ లు.