ఈమధ్యన బాలీవుడ్ సినిమాలని వ్యతిరేఖిస్తూ బాయ్ కాట్ బాలీవుడ్ హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ హిందీ బడా హీరోలకి చుక్కలు చూపిస్తున్నారు నెటిజెన్స్. కొంతమంది ఈ బాయ్ కాట్ బాలీవుడ్ పై యుద్ధం ప్రకటిస్తే మరికొందరు సైలెంట్ గా, కామ్ గా ఉంటున్నారు. అర్జున్ కపూర్ ఈ బాయ్ కాట్ హాష్ టాగ్ పై బాలీవుడ్ అంతా ఏకధాటిపైకి రావాలంటూ పిలుపునిచ్చాడు. ఇక హిందీలో నేపోటిజం పై చాలామంది ఆగ్రహంగా కనిపించడమే కాదు, బాలీవుడ్ నుండి ఏ సినిమా రిలీజ్ అవుతున్నా బాయ్ కాట్ చెయ్యాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. రీసెంట్ గా వచ్చిన లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్, అలాగే రాబోయే బ్రహ్మాస్త్ర, విక్రమ్ వేద ఇలా ప్రతి హిందీ సినిమాపై ఈ బాయ్ కాట్ హాష్ టాగ్ సెగ తగులుతుంది.
అదే బాయ్ కాట్ సెగ సౌత్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ కి తగిలింది. ఈ సినిమాని సక్రమంగా సౌత్ సినిమాగా ప్రొజెక్ట్ చేసి రిలీజ్ చేస్తే ఇలాంటిది ఉండేది కాదు. కానీ బాలీవుడ్ కరణ్ జోహార్ ఈ సినిమాలో భాగమవడంతో ఆ బాయ్ కాట్ నిరసన లైగర్ ని తాకింది. అయితే ఏ సినిమాలకైతే ఈ బాయ్ కాట్ హాష్ టాగ్ తగిలించి ట్రెండ్ చేస్తున్నారో.. ఆ సినిమాలన్ని డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్లిపోతున్నాయి. అలా లాల్ సింగ్ చద్దా, అటాక్, రక్షా బంధన్, శంషేరా సినిమాలకి బాయ్ కాట్ సెగ తగలడం, డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్లడంతో.. ఇప్పుడు లైగర్ ని కూడా ఆ బాయ్ కాట్ సెగ తాకడం.. కరణ్ జోహార్ వలనే ఈ సినిమా కి సినిమాకి మిక్స్డ్ టాక్ కాకుండా ప్లాప్ టాక్ రావడంతో.. అయ్యయ్యో ఈ బాయ్ కాట్ హాష్ టాగ్ కి లైగర్ కూడా బలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.