ఆరు సీజన్స్ ని టీవీలో సక్సెస్ ఫుల్ గా నడిపిన కరణ్ జోహార్.. ఇప్పుడు ఏడో సీజన్ ని ఓటిటిలో రక్తి కట్టించేందుకు నానా తంటాలు పడుతున్నాడు. కరణ్ జోహార్ షో కి రావాలంటే తమ సీక్రెట్స్ ఎక్కడ బయట పెట్టాలో అనే భయంతో చాలామంది భయపడుతున్నారు. మరికొందరు ధైర్యంగా కరణ్ జోహార్ ప్రశ్నలను ఫేస్ చేస్తున్నారు. కరణ్ జోహార్ షో అంతా సినిమా ప్రమోషన్స్ కాకుండా.. పర్సనల్ విషయాలే హైలెట్ అవుతున్నాయి. ప్రేమ, పెళ్లి ఇలా అన్నమాట. ఇప్పటివరకు షో కి హాజరైన వారిని కరణ్ జోహార్ ఇలాంటి ప్రశ్నలతోనే ఇబ్బంది పెడుతున్నాడు. కొంతమంది ఓపెన్ అయినా, మరికొంతమంది మాత్రం గుట్టు దాచేస్తున్నారు.
అయితే తాజాగా తన షో కి సీనియర్ నటి రేఖ ని ఎన్నిసార్లు పిలిచినా రాలేదు అని, కాఫీ విత్ కరణ్ షో కి రావాలంటూ రేఖ మేడమ్‌ను చాలా అభ్యర్థించాను. గత సీజన్స్ కే కాదు ఈ ఓటిటి సీజన్ కోసం కూడా అడిగా. రేఖ మేడం ఎలాగైనా నా షోలో కనబడాలనుకున్నాను. కానీ ఆవిడ మాత్రం నా షో లో కనిపించడానికి, రావడానికి అస్సలు ఒప్పుకోలేదు, అంటే ఆమె ఏదో రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలనుకుంటుంది. అందుకే నా షో కి రావడానికి భయపడుతున్నారు. అంటే ఆమె రహస్యాన్ని బయటపెట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆవిడ ఎప్పటికి నా షో కి రాకపోవచ్చు అంటూ సంచలనంగా మాట్లాడాడు.