గత ఏడాది బాలీవుడ్ ని కుదిపేసిన కేసు.. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో అరెస్ట్ అవడం. పోర్నోగ్రఫీ కేసులో కొన్నాళ్ళు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. శిల్పా శెట్టి ఈ కేసు తర్వాత కొన్నాళ్ళకి మాములుగా మారగా.. రాజ్ కుంద్రా మాత్రం మీడియా కంట పడకుండా తిరుగుతున్నాడు. యాక్టింగ్ ఫ్యాషన్ తో వచ్చే యువతులతో రాజ్ కుంద్రా అతని బ్యాచ్ పోర్న్ వీడియోలు చిత్రీకరించి వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజ్ కుంద్రా తనపై మోపిన ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో చెప్పినట్టుగా తాను ఏ నేరం చెయ్యలేదు అని, రహస్యంగా ఎటువంటి చిత్రీకరణ చెయ్యలేదు, అంతేకాకుండా ఎటువంటి బ్లూ ఫిలిం కంటెంట్ అప్ లోడ్ చెయ్యలేదు అని, అలాగే వాటిని ప్రసారం చేసే కార్యకలాపాల్లో పాల్గొనలేదని, అటు ఛార్జ్ షీట్ లోను తాను ఎవరిని బెదిరించలేదు అని, బలవంతం పెట్టి.. వీడియో తీసినట్టు ఎక్కడా లేదు అని, తానే నేరం చెయ్యలేదు, తనని ఈ కేసులో బలి పశువుని చేసారంటూ రాజ్ కుంద్రా తనపై కేసుని కొట్టివేయాలంటూ కోర్టుని ఆశ్రయించాడు. మరి ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.