విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన లైగర్ సినిమాలో కరణ్ జోహార్ కూడా భాగమవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారీ ప్రమోషన్స్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ మూవీ ని వీక్షించి థియేటర్స్ బయటికి వస్తున్న ప్రేక్షకులని సినిమా ఎలా వుంది, విజయ్ దేవరకొండ ఎలా నటించాడు, పూరి మార్క్ డైరెక్షన్ కనిపించిందా అని ప్రశ్నించిన వారికి షాకింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు లైగర్ చూసిన ఆడియన్స్. సినిమా అస్సలు బాలేదు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఒక్కడే బావున్నాడు. సినిమాలో అంతకుమించి ఏం లేదు అంటున్నారు. పోనీ విజయ్ కోసం ఒకసారి లైగర్ చూడచ్చా అంటే.. నో అంటూ చెబుతున్నారు.
ఆ సినిమా ఏంది, ఆ స్టోరీ ఏంది, పూరి డైరెక్షన్ బాలేదు, ఫస్ట్ 20 నిముషాలు పూరి డైరెక్టన్, తర్వాత మొత్తం కరణ్ జోహార్ డైరెక్షన్, నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి, వాళ్ళకి నచ్చేట్టుగా సినిమా చేసారు కానీ, సౌత్ ఆడియన్స్ కి ఏ మాత్రం సినిమా నచ్చదు. సాంగ్స్ అయితే పక్కా నార్త్ మోడల్ లో ప్రెజెంట్ చేసారు, అసలు ఆ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సినిమా చివరిలో ఎందుకు వచ్చాడో అర్ధం కావడం లేదు, ఆయన ఇజ్జత్ తీశారు, ఫస్ట్ హాఫ్ చిరాగ్గా ఉంది అంటే.. సెకండ్ హాఫ్ మరీ వరెస్ట్, కాస్త విజయ్ దేవరకొండ నే చూడబుద్ది అయ్యింది అంటూ పబ్లిక్ లైగర్ మూవీపై ఇస్తున్న టాక్ తో రౌడీ ఫాన్స్ ఢీలా పడిపోతున్నారు. మరి మాస్ ఆడియన్స్ ఎమన్నా ఆదిరిస్తే లైగర్ గట్టెక్కుతుందేమో చూడాలి.