ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ అవకాశం దొరికితే అల్లు అర్జున్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడు మారుతి కి ప్రభాస్ కి కథ చెప్పి ఆయన్ని ఒప్పించడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చిన్న కథ అయినా, పెద్ద కథ అయినా.. పాన్ ఇండియా స్టార్ తో ప్రభాస్ తో సినిమా చెయ్యడం అంటే మాములు విషయం కాదుకదా.. కానీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టకుండానే ప్రభాస్ ఫాన్స్ చేతిలో మారుతికి ఘోర అవమానం ఎదురైంది. పక్కా కమర్షియల్ సినిమా ప్లాప్ తర్వాత మారుతి తో ప్రభాస్ సినిమా అనగానే ప్రభాస్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.
ఈరోజు సడన్ గా ప్రభాస్-మారుతి సినిమా పూజా కార్యక్రమాలు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో కనిపించింది. గురువారం ఉదయం ప్రభాస్ - మారుతి సినిమా అఫీషియల్ గా మొదలు కాబోతుంది అని చూసిన ప్రభాస్ ఫాన్స్ రెచ్చిపోయి మారుతి కి చుక్కలు చూపిస్తున్నారు. మారుతి ని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వెలివెయ్యాలి, బాన్ చెయ్యాలి, ప్లాప్ దర్శకుడితో ప్రభాస్ సినిమా చెయ్యడం ఎందుకు, మారుతి తో ప్రభాస్ అన్నా మీరు సినిమా చెయ్యొద్దు అంటూ ప్రభాస్ ఫాన్స్ మారుతి పిక్ ని పెట్టి #BoycottMaruthiFromTFI హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ మీమ్స్ చేస్తూ మారుతి ని ఓ ఆట ఆడుకుంటున్నారు. పాపం ఇవన్ని చూసిన మారుతి ప్రభాస్ తో సినిమా ఏమో కానీ, ఎరక్కపోయి ఇరుక్కున్నాను అని అనుకొకమానడు.