విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న లైగర్ మూవీ నేడు గురువారం విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఓ 20 రోజుల పాటు విజయ్ దేవరకొండ - అనన్య పాండే లు సినిమా ని యూత్ లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డారు. ప్రమోషన్స్ విషయంలో విజయ్ ఎక్కడా తగ్గలేదు. మరి నిన్నటితో ప్రమోషన్స్ ముగియడం, ఈ రోజు సినిమా రిలీజ్ అవుతుండడంతో.. పూరి, ఛార్మి, విజయ్ లు గత రాత్రి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కనిపించడం సంచలనంగా మారింది. లైగర్ పార్టీ ఫ్రేమ్ లో ప్రశాంత్ నీల్ కనిపించడంతో.. ఏంటి విజయ్ దేవరకొండ, ఏంటి విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ఇంకా ఈ ఫ్రేమ్ లో లైగర్ టీం తో పాటుగా మెహర్ రమేష్ కూడా ఉన్నాడు. హీరోయిన్ అనన్య పాండే, హీరో ఆకాష్ పూరి ఉండగా.. ఈ పార్టీలో విజయ్ దేవరకొండ ఫుల్ గా చిల్ అవుతున్నాడనిపిస్తుంది. లైగర్ సూపర్ హిట్ కొట్టడం పక్కా అన్న రేంజ్ లో ఈ పార్టీ జరగడం ఓ ఎత్తు, ఈ పార్టీలోకి ప్రశాంత్ నీల్ రావడం ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తో చేస్తున్న సలార్ పాన్ ఇండియా మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఎప్పటినుండో హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అలా పూరి ఇచ్చిన లైగర్ పార్టీకి ప్రశాంత్ నీల్ హాజరయ్యారు.