Advertisementt

లైగర్: ఓవర్సీస్ రివ్యూ

Thu 25th Aug 2022 08:46 AM
liger movie,liger overseas review,liger review,vijay deverakonda  లైగర్: ఓవర్సీస్ రివ్యూ
Liger Overseas review లైగర్: ఓవర్సీస్ రివ్యూ
Advertisement

విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కరణ్ జోహార్-ఛార్మి-పూరి నిర్మాతలుగా తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఓవర్సీస్ లో మంచి స్పందన కాదు.. విపరీతమైన క్రేజ్, హైప్ కనిపించింది. ఇక ఓవర్సీస్ లో లైగర్ షోస్ పడడంతో అక్కడి ప్రేక్షకులు సినిమా చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. లైగర్ మూవీ ఇలా ఉంది, అలా ఉంది, విజయ్ దేవరకొండ పెరఫార్మెన్స్ అదుర్స్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి లైగర్ ఓవర్సీస్ టాక్, నెటిజెన్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

విజయ్ దేవరకొండ లుక్స్ వైజ్ గా, పెరఫార్మెన్స్ పరంగా సూపర్‌గా ఉన్నాడు.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఎఫిక్టివ్ రోల్స్‌లో కనిపించారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకండాఫ్‌‌లో 40 నిమిషాలు బాగున్నది.. అని కొందరు అంటుంటే.. సినిమా ఫస్టాఫ్ యావరేజ్. ఎలివేషన్ సీన్లు, కొన్ని డైలాగ్స్ వర్కవుట్ అయ్యాయి. లైగర్ స్టోరి పర్లేదు, హీరో విజయ్ దేవరకొండ ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. కానీ నత్తి విజయ్ కి సూట్ కాలేదు అంటూ మరో ఇంటిజెన్ స్పందిస్తున్నాడు. ఇక ఓవరాల్ ఆడియన్స్ హీరోయిన్ అనన్య పై ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనన్య పాండే లైగర్ కి మైనస్ అని, ఆమె ఆకట్టుకోలేకపోయింది అని. అలాగే సాంగ్స్ కూడా ఏమాత్రం బాలేదు అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్‌ మాదిరిగా ఇంట్రడక్షన్ సీన్లు బాగున్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్.. కానీ కథ లో బలం లేదు, లైగర్ యావరేజ్ సినిమా. సెకండాఫ్ కొంత బాలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. క్లైమాక్స్ బాలేదు అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేస్తున్నాడు.

సో లైగర్ కి ఇప్పటివరకు అయితే మిక్స్డ్ టాక్ పడింది అనే చెప్పొచ్చు. మాస్ ప్రేక్షకులు ఆదరిస్తే.. సినిమా హిట్ పక్కా అంటూ చాలామంది తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

Liger Overseas review:

Liger Netizens and Social media review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement