టాప్ హీరోయిన్, ప్రస్తుతం సీనియర్ లిస్ట్ లోకి వెళుతున్న హీరోయిన్ త్రిష గత కొన్నాళ్లుగా సైలెంట్ గా మీడియా కి, సోషల్ మీడియా కి దూరంగానే ఉంటుంది. చిరు ఆచార్య నుండి త్రిష వాకౌట్ చేసాక మళ్లీ తమిళ సినిమాలతో బిజీ అయ్యింది. మధ్యలో త్రిష పెళ్లి పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొన్నాళ్లుగా ఆమె చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్న టైం లో ఒక్కసారిగా త్రిష రాజకీయాల్లోకి రాబోతుంది అని, అది కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతుంది అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. త్రిష కృష్ణన్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఓ స్టార్ వెనుకుండి నడిపిస్తున్నాడు అంటూ ఏవేవో ప్రచారాలు మొదలయ్యాయి.
అయితే తాజాగా త్రిష రాజకీయాల్లోకి వెళ్లడంపై ఆమె తల్లి ఉమ కృష్ణన్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదని ఆమె స్పష్టం చేసింది. త్రిష ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని, పలు భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది అని, త్రిష పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న న్యూస్ లు అన్ని రూమర్స్ అని కొట్టి పారెయ్యగా.. త్రిష కూడా ఇలాంటి గాసిప్స్ ఎక్కడ నుండి పుడుతున్నాయి అంటూ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.