Advertisementt

గాడ్ ఫాదర్ ఓటిటి డీల్ ఫినిష్

Wed 24th Aug 2022 01:45 PM
chiranjeevi,godfather movie,amazon prime video  గాడ్ ఫాదర్ ఓటిటి డీల్ ఫినిష్
GodFather locks OTT streaming partner గాడ్ ఫాదర్ ఓటిటి డీల్ ఫినిష్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ దసరా స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా మెగాస్టార్ బర్త్ డే కి ఒకరోజు ముందే గాడ్ ఫాదర్ నుండి టీజర్ రిలీజ్ చెయ్యగా.. అందులో చిరు లుక్స్, ఆయన యాక్షన్ సీన్స్, నయనతార పగ, సల్మాన్ ఖాన్ తో చిరు జర్నీ అన్ని మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చాయి. ఆచార్య ప్లాప్ తర్వాత ఎన్నో అంచనాలు మధ్యన విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ కోసం మెగా ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ గా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం గట్టి పోటీనే నడుస్తుంది అని చెబుతున్నారు. 

పెద్ద పెద్ద ఓటిటి సంస్థలు గాడ్ ఫాదర్ రైట్స్ కోసం పోటీ పడినా.. చివరికి భారీ డీల్ తో ఈ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా తెలియకపోయినా.. అమెజాన్ ప్రైమ్ చేతికే గాడ్ ఫాదర్ హక్కులు వెళ్ళినట్లుగా చెబుతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సత్య దేవ్ నెగటివ్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార చిరు కి సిస్టర్ గా నటిస్తుంది. మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

GodFather locks OTT streaming partner:

Chiranjeevi GodFather locks its OTT streaming partner?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ