ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వకముందే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో RC15 అంటూ రామ్ చరణ్ రంగంలోకి దిగిపోయారు. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి ముందే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసేసారు. తర్వాత కూడా వైజాగ్ షెడ్యూల్, అమృతసర్ షెడ్యూల్ అంటూ RC15 షూటింగ్ ని పరుగులు పెట్టించారు. శంకర్, చరణ్ తో కలిసి RC15 చిత్రీకరణని చాలావరకు పూర్తి చేసేసారు. కాని ఇప్పుడు శంకర్ RC15 ని పక్కనబెట్టేసి భారతీయుడు షూటింగ్ కి జంప్ అయ్యారు. కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు2 షూటింగ్ ని మళ్ళీ ఈ రోజు నుండి మొదలు పెట్టేసారు. గతంలో ఓ షెడ్యూల్ పూర్తయ్యాక ఆగిపోయిన భారతీయుడు 2 షూట్ రెస్యూమ్స్ అంటూ హడావిడి చెయ్యడంతో ఇప్పుడు రామ్ చరణ్ ఏం చేస్తారో.. ఆయన పరిస్థితి ఏమిటో అంటూ మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు.
RC16 ని జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించిన రామ్ చరణ్.. ఇమ్మిడియట్ గా ఆ సినిమా మొదలు పెట్టలేరు. కారణం జెర్సీ రీమేక్ తో బాలీవుడ్ లో భారీ డిసాస్టర్ అందుకున్నారు గౌతమ్ తిన్ననూరి. ఇప్పడు RC15 షూటింగ్ ఆగిపోవడం, అటు RC16 షూటింగ్ మొదలు పెట్టలేని పరిస్థితుల్లో చరణ్ ఉండడంతో మెగా ఫాన్స్ అయోమయంలో పడ్డారు. శంకర్ భారతీయుడు, RC15 ని పారలల్ గా చేసే అవకాశం లేదు. అంటే భారతీయుడు 2 ఘాటింగ్ కంప్లీట్ అయ్యేవరకు చరణ్ వెయిట్ చేయాల్సిందేనా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన అనుమానం.