Advertisementt

ఇండియన్ 2 నుండి బిగ్గెస్ట్ అప్ డేట్

Wed 24th Aug 2022 10:04 AM
bharateeyudu 2 movie,indian 2,kamal haasan,shankar  ఇండియన్ 2 నుండి బిగ్గెస్ట్ అప్ డేట్
Crazy update on Indian 2 ఇండియన్ 2 నుండి బిగ్గెస్ట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ కథానాయకుడిగా టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు కి సీక్వెల్ గా తెరకెక్కాల్సిన భారతీయుడు 2 మూవీ కొన్ని అవాంతరాల వలన ఓ షెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. భారతీయుడు 2 షూటింగ్ ఆగాక కమల్ హాసన్ విక్రమ్ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. శంకర్ కూడా రామ్ చరణ్ తో RC15 సెట్స్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు భారతీయుడు 2 ఖచ్చితంగా షూటింగ్ చెయ్యాల్సిన పరిస్థితి రావడంతో శంకర్ కూడా దాని కోసం రెడీ అయ్యారు. కమల్ అమెరికా వెళ్లి మేకోవర్ అయ్యి వచ్చారన్నారు. అయితే సెప్టెంబర్ నుండి భారతీయుడు 2 షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అన్నప్పటికీ అధికారిక అప్ డేట్ లేదు.

కానీ తాజాగా ఇండియన్ 2 పై బిగ్గెస్ట్ అప్ డేట్ బయటికి వచ్చింది. అది భారతీయుడు 2 ని నిర్మించాల్సిన లైకా ప్రొడక్షన్ కి తోడుగా మరో నిర్మాణ సంస్థ ఈ సినిమాలో భాగమైంది. ప్రముఖ సంస్థ రెడ్ జయింట్ వారు భారతీయుడు 2 లో భాగం అయ్యినట్టుగా మేకర్స్ సహా హీరో కమల్ కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ నుండి భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా కమల్ హాసన్ చెప్పడంతో ఆయన ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ రోజు నుండి ఇండియన్ 2 షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

Crazy update on Indian 2:

Bharateeyudu 2 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ