Advertisementt

అల్లు అర్జున్ రెడీ మరి ఎన్టీఆర్..

Tue 23rd Aug 2022 07:25 PM
pushpa 2,allu arjun,ntr30,ntr,koratala  అల్లు అర్జున్ రెడీ మరి ఎన్టీఆర్..
Pushpa 2 Shoot Begins With a Grand Puja అల్లు అర్జున్ రెడీ మరి ఎన్టీఆర్..
Advertisement
Ads by CJ

ఈ నెలలో మూడు బిగ్ బడ్జెట్ మూవీస్ మొదలు కావాల్సి ఉంది. అందులో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పుష్ప పార్ట్ 2 అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో మొదలైంది. షూటింగ్స్ బంద్ ఉన్నప్పటికీ.. పూజ తో ముహూర్తం పెట్టింది పుష్ప టీం. అంటే షూటింగ్స్ మొదలు కాగానే.. అల్లు అర్జున్ సెట్స్ మీదకి వెళ్ళిపోతారు. బిజీ అవుతారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఇంకా సైలెన్స్ నే మెయింటింగ్ చేస్తున్నారు. కొరటాలతో ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఫాన్స్ ఆతృతగా ఉన్నప్పటికీ.. ఆ సినిమా అప్ డేట్ మాత్రం బయటకి రానివ్వడం లేదు. సెప్టెంబర్ నుండి అని కొందరు, అక్టోబర్ దసరా టైం లో NTR30 అఫీషియల్ గా మొదలు కాబోతుంది అని ఒకరు అంటున్నారు కానీ.. అధికారికంగా అప్ డేట్ లేదు.

కొరటాల ఇంకా ఇంకా NTR30 స్క్రిప్ట్ పై కుస్తీలు పడుతూనే ఉన్నారో.. లేదంటే మారేదన్నా కారణమో కానీ.. ఆ సినిమా లేట్ అయ్యే కొలది ఎన్టీఆర్ ఫాన్స్ లో టెన్షన్ పెరిగిపోతుంది. అలాగే మహేష్ - త్రివిక్రమ్ SSMB28 రెగ్యులర్ షూటింగ్ కూడా షూటింగ్స్ మొదలు కాగానే మొదలు పెట్టేసేలా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం నాన్చుతూ వుండేసరికి ఫాన్స్ అయోమయంలో పడుతున్నారు. ఏదైనా చిన్నపాటి అప్ డేట్ వస్తేనే కానీ.. NTR30 విషయంలో ఫాన్స్ కి ఓ క్లారిటీ రాదు.

Pushpa 2 Shoot Begins With a Grand Puja:

NTR30 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ