రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ కోసం కేవలం ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ మాత్రమే వెయిట్ చెయ్యలేదు. ఇండియా వైడ్ మూవీ లవర్స్ అంతా ట్రిపుల్ ఆర్ కోసం వెయిట్ చేసేలా ఆ సినిమా ప్రమోషన్స్ కనిపించాయి. ఓపెనింగ్స్ రోజునే కొత్త ట్రెండ్ సృష్టించేలా రాజమౌళి చేసిన ప్రమోషన్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ ఫుల్ గా వర్కౌట్ అయ్యాయి. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల కుస్తీపట్లు, బుక్ మై షో లో టికెట్ల కొరత, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ప్రేక్షకుల తోపులాటలో థియేటర్స్ దద్దరిల్లి పోయాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ లైగర్ మూవీ థియేటర్స్ దగ్గర కూడా మరోసారి అంతే సందడి కనిపించేలా ఉంది వ్యవహారం.
పాన్ ఇండియా మూవీ గా ఈ గురువారం విడుదల కాబోతున్న లైగర్ మూవీ పై ఇండియా వైడ్ ప్రేక్షకుల్లోనూ చాలా ఉత్సాహం కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ లైగర్ కి చేస్తున్న ప్రమోషన్స్ తీరుకి రౌడీ ఫాన్స్ ఫిదా అవ్వడమే కాదు, బుక్ మై షో లోను టికెట్స్ హాట్ కేకుల్లా తెగుతున్నాయి. ట్రిపుల్ ఆర్ లా లైగర్ బెన్ఫిట్ షోస్, అలాగే లైగర్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రేక్షకులు బాక్సాఫీసు దగ్గరకి థియేటర్స్ లోపలి పరుగులు పెట్టేలా లైగర్ పై ఆసక్తి జనాల్లో క్రియేట్ అయినట్లుగా కనబడుతుంది. మరి ఫస్ట్ టైం లైగర్ తో పాన్ ఇండియా ప్రేక్షకులని కలవబోతున్న విజయ్ దేవరకొండ లక్ ఎలా ఉందో మరి కొద్ది గంటల్లోనే తెలిసిపోతుంది.