బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా ప్రాజెక్ట్ అయ్యి.. చెట్టాపట్టాలేసుకుని వెకేషన్స్, ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తున్న కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రాలు ల మధ్యన ఫ్రెండ్ షిప్ కాదు, అంతకుమించి అనేలా వారి మధ్యన ప్రేమ ఉంది అని ప్రచారం జరగడమే కానీ.. వారు ఎక్కడా ఒకరికొకరం ఇష్టపడుతున్నాం అని కానీ, డేటింగ్ లో ఉన్నట్లుగా చెప్పలేదు. కానీ మీడియా మాత్రం కియారా - సిద్దార్థ్ పైనే ఫోకస్ పెట్టింది. ఈ మధ్యన వీరిమధ్యన విభేదాలు కూడా వచ్చాయంటూ ప్రచారం జరిగింది. కానీ మళ్ళీ ఓ ఈవెంట్ లో కలిసి కనిపించి షాకిచ్చారు. తాజాగా కాఫి విత్ కరణ్ షో లో కియారా సిద్దార్థ్ తో రిలేషన్ పై ఓపెన్ అయినట్లే కనిపిస్తుంది.
గత ఆరు సీజన్స్ ని టివిలో సక్సెస్ చేసిన కరణ్ జోహార్ ఇప్పుడు ఓటిటిలో కాఫీ విత్ కరణ్ షో పై క్యూరియాసిటీ పెంచేందుకు షో లో పర్సనల్ విషయాలను ప్రశ్నలుగా మార్చి సెలబ్రిటీస్ పై ప్రయోగివస్తున్నాడు. కొన్ని కొన్ని చోట్ల ఈ విషయాలు మిస్ ఫైర్ అయినా.. మరికొన్ని సందర్భాల్లో ఆ పర్సనల్ విషయాలే సోషల్ మీడియా ని కమ్మేస్తున్నాయి. తాజాగా షో లో పాల్గొన్న కియారా అద్వానీ ని కూడా కరణ్ జోహార్ తన పర్సనల్ ప్రశ్నలు, అలాగే లవ్ మేటర్ ని కదిపాడు. సిద్దార్థ్ రిలేషన్ ఫై ప్రశ్నలు వేసాడు. దానితో కియారా కూడా కరణ్ కి కొద్దిగా షాకిస్తూ.. సిద్దార్థ్ మల్హోత్ర తనకు మంచి ఫ్రెండ్.. అంతకంటే ఎక్కువే అని చెప్పుకొచ్చింది కానీ.. అసలు గుట్టు బయటపెట్టలేదు. అయినా కరణ్ కూడా వదల్లేదు. అంతేకాదు.. కియారా తో కలిసి వచ్చిన షాహిద్ కపూర్ కూడా రెచ్చిపోయాడు. ఈ ఏడాది కియారా - సిద్దార్థ్ నుంచి సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చే చాన్స్ ఉందని అనగానే.. కియారా కూడా అవునేమో.. జరుగుతుందేమో అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.