కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసార సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ అవ్వకపోయినా.. ఓటిటి పార్ట్నర్ విషయాలు మాత్రం రివీల్ అయ్యాయి. కొత్త దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ బింబిసార గా చేసిన పెరఫార్మెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అటు ఓపెనింగ్స్ పరంగాను, ఇటు కలెక్షన్స్ పరంగాను బింబిసారా తో కళ్యాణ్ రామ్ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు. అతనొక్కడే, పటాస్ సినిమాల తర్వాత అంతకన్నా ఎక్కువ విజయాన్ని బింబిసారతో మూటగట్టుకున్నాడు కళ్యాణ్ రామ్.
ఇక థియేటర్స్ లో కలెక్షన్స్ కుమ్మేసిన బింబిసార ని భారీ డీల్ తో ప్రముఖ ఓటిటి యాప్ జీ5 వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈమధ్యన దిల్ రాజు చెప్పినట్టుగా సినిమా రిలీజ్ అయిన ఏడెనిమిది వారాల తర్వాతే బింబిసార జీ 5 లో రిలీజ్ కావొచ్చు అని తెలుస్తుంది. అందుకే డేట్ కన్ ఫమ్ చెయ్యలేదు. మరి 50 రోజుల తరవాత కళ్యాణ్ రామ్ బింబిసార ని జీ 5 లో వీక్షించేందుకు ఆయన ఫాన్స్ తో పాటుగా ఓటిటి ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.