పుష్ప ద రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి పార్ట్ టు గా రాబోతున్న పుష్ప ద రూల్ పై అంచనాలు ఆకాశంలోకి వెళ్లాయి. పుష్ప పార్ట్ 1 విడుదలై దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాయి. దానితో పుష్ప పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటీకి, ఆత్రుతకి తెరదించుతూ నిన్న అంటే సోమవారం పుష్ప ద రూల్ గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది. అల్లు అర్జున్ పుష్ప గా మరోసారి తగ్గేదెలా అంటూ సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. హీరోయిన్ గా పార్ట్ 2 లోను శ్రీవల్లి రశ్మికనే కంటిన్యూ అవుతుంది. మరి పుష్ప ద రూల్ అట్టా మొదలైందో లేదో.. రష్మిక ఇట్టా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
శ్రీవల్లి గా డీ గ్లామర్ గా రష్మిక పుష్ప రాజ్ తో చేసిన రొమాన్స్ పుష్ప లో హైలెట్ అవడం, పాన్ ఇండియా మూవీ చేసిన హీరోయిన్ గా రశ్మికకి పేరొచ్చింది. అటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ దూసుకుపోతున్న రష్మిక ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ ఒప్పుకుంది.. దానితో రష్మిక ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ హడావిడి చేస్తుంది. ఇటు పుష్ప ద రూల్ అటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్, అలాగే మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు.. రష్మిక యవ్వారం మాములుగా లేదు.. అందుకే ఇంత క్రేజ్ అంటూ ఆమె ఫాన్స్ ఎగిసిపడుతున్నారు.