మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని సరస్వతీ పుత్రుల దీవెనలు అందాయి. సరస్వతీ పుత్రులంటే ఎవరని అనుకుంటున్నారా? మన రచయితలు. వారిని చిరంజీవి అలాగే భావిస్తుంటారు. చిరు పుట్టినరోజును పురస్కరించుకుని.. శుభాకాంక్షలు తెలుపుతూ.. వారు చేసిన ట్వీట్స్ ఇవే.
‘‘పునాది రాళ్లు సినిమాతో పునాది వేసుకుని ఎన్నో అద్భుతమైన, విజయంతమైన చిత్రాలలో కథానాయకుడిగా నటించి, మెగాస్టార్ ఐనా అందరూ నా వాళ్ళే అనుకుంటూ , పదిమంది బాగుండాలని కోరుకొనే చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు శతమానం భవతు జై చిరంజీవ’’- పరుచూరి గోపాలకృష్ణ
‘‘విజయాలు, సంచలనాలు మెగాస్టార్‌కి చాలా చిన్న చిన్న విషయాలు. ఆయన అరచేతి నీడ కింద తలదాచుకుంటుంటాయ్. రికార్డులన్నమాట ఆయన సృష్టిస్తే పుట్టింది. అవి ఆయన అడుగుజాడల్లో బతుకుతుంటయ్. వందేళ్ళకు పైగా విజయాలకి ఊపిరి పోస్తూ వర్ధిల్లాలని కొరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు’’- సాయిమాధవ్ బుర్రా
‘‘ప్రజలను పరిశ్రమను అలరించడమైనా ఆదుకోవడమైనా మీరు చేస్తున్న సేవ నిష్కల్మషం నిరంతరాయం ఆ భగవంతుని చల్లని చూపులు మిమ్మల్ని మరింత చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ప్రియమైన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ - రామజోగయ్య శాస్త్రి
‘‘తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక నటనా శైలితో, స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి, ఎంతో మంది నటులకు ఆదర్శంగా నిలిచారు చిరంజీవిగారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇండస్ట్రీకి అండగా ఉండే చిరంజీవిగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..’’ - గోపీ మోహన్