Advertisementt

‘పుష్ప రాజ్’ రూల్‌కి పూజయింది.. కానీ?

Fri 26th Aug 2022 02:45 PM
allu arjun,sukumar,pushpa,pushpa the rule,pushpa 2,pooja ceremony,sukumar,bunny  ‘పుష్ప రాజ్’ రూల్‌కి పూజయింది.. కానీ?
Pushpa The Rule pooja ceremony completed ‘పుష్ప రాజ్’ రూల్‌కి పూజయింది.. కానీ?
Advertisement
Ads by CJ

‘నీ యవ్వ తగ్గేదేలే’ అంటూ ప్రపంచం మొత్తాన్ని తన మ్యానరిజంతో మెప్పించిన పుష్పరాజ్.. ఇప్పుడు రూల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ‘పుష్ప ది రైజ్’ విడుదలై చాలా కాలం అవుతున్నా.. ‘పుష్ప 2 ది రూల్’‌ని ఇంత వరకు సెట్స్‌పైకి తీసుకెళ్లక పోవడంతో.. గత కొన్ని రోజులుగా ఈ పార్ట్ 2పై అనేకానేక వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇలా వార్తలు వచ్చిన ప్రతీసారి.. సుకుమార్ ఇంకా కథని చెక్కుతున్నాడట!, బుచ్చిబాబు రెండో సినిమాకి సుక్కు హెల్ప్ చేస్తున్నాడట! అంటూ ఏదో ఒక సమాధానం మేకర్స్ వినిపిస్తూ వచ్చారు. ఇంకా అలాంటి కబుర్లు చెబితే.. ఫ్యాన్స్ ఒప్పుకోరని అనుకున్నారో.. ఏమో తెలియదు కానీ.. తాజాగా ‘రూల్’కి సంబంధించిన పూజా కార్యక్రమాలను మేకర్స్ ముగించేశారు. పూజా కార్యక్రమాలు అయితే ముగించారు కానీ.. రెగ్యులర్ షూట్ విషయంలో మాత్రం మళ్లీ మొదటికే వచ్చారు. త్వరలో.. అని వదిలేశారు. దీంతో పూజా కార్యక్రమాలు పూర్తయినందుకు సంతోషపడాలో.. లేక షూటింగ్ ఎప్పుడనేది చెప్పకుండా.. మూడక్షరాలతో ముగించినందుకు నిరుత్సాహపడాలో అర్థం కాక అల్లు అర్జున్ అభిమానులు.. కామ్‌గా ఉండిపోయారు. 

 

అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా.. షూటింగ్ పూర్తై థియేటర్లలోకి సినిమా ఎప్పుడొచ్చినా.. తన అడ్డాకి తిరుగులేదు బిడ్డా.. అనేలా ‘పుష్పరాజ్’ అక్కడ మేనియాని క్రియేట్ చేశాడు. ఆ క్రేజ్‌కి సరిపడా అంచనాలను 100 శాతం కాకపోయినా.. ఓ 60 లేదంటే 70 శాతం అందుకున్నా చాలు.. ‘పుష్పరాజ్’ని ఇక పట్టుకునే వాడెవడు ఉండడు.. కలెక్షన్ల సునామీ ఖాయం. అందులోనూ ఈ సారి టీమ్ ప్రచార కార్యక్రమాలను కూడా భారీగా చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైజ్‌లోనే రఫ్ఫాడించిన బన్నీ బాబు.. ఈ సారి పక్కా ప్లానింగ్‌తో రూల్ చేయడానికి దిగాడంటే.. బాక్సాఫీస్ బద్దలే. చూద్దాం.. పుష్పరాజ్ రూల్, రూలింగ్ ఎలా ఉండబోతోందో..!

Pushpa The Rule pooja ceremony completed:

Allu Arjun Pushpa The Rule movie pooja ceremony performed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ