భారతీయ జనతా పార్టీకి సంబంధించి నెంబర్ 2 ఫొజిషన్‌లో ఉన్న నాయకుడు, కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడులో జరగనున్న సమరభేరి నిమిత్తమై హైదరాబాద్ వచ్చిన అమిత్‌షాను శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఎన్టీఆర్ కలిశారు. అయితే ఈ భేటీ జరగబోతుందని ముందే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ భేటీతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చలు మొదలయ్యాయి. అమిత్‌షా ఇలా భేటీ అవడానికి కారణం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అని, అందులో ఎన్టీఆర్ నటనను అభినందించేందుకే భేటీ ఏర్పాటు చేయడం జరిగిందని బిజెపీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పరంగా అభినందించాల్సి వస్తే.. ఎన్టీఆర్‌తో పాటు చరణ్‌ని, దర్శకుడు రాజమౌళిని కూడా పిలిపించి ఉండాలి.. కానీ అది జరగలేదు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఎన్టీఆర్‌కి ఎంత పేరు వచ్చిందో.. అంతకంటే ఒక ఇంచె ఎక్కువే చరణ్‌కి పేరు వచ్చింది. ఇప్పటికీ హాలీవుడ్‌లో సైతం చరణ్ పేరు మారుమోగుతుంది. అభినందించాలి అనుకుంటే.. ఖచ్చితంగా ముందు వరుసలో చరణ్ ఉండాలి. కానీ చరణ్ లేకుండా.. కేవలం ఎన్టీఆర్‌తోనే భేటీ ఎందుకని? అనేలా టీడీపీ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా చర్చలు నడుస్తున్నాయి. వీరిద్దరి భేటీలో అసలు ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయి. కేవలం సినిమా పరంగానేనా? లేక రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయా? ఈ కోణంలో తెలుగు రాష్ట్రాల్లో చర్చలు మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరు వినబడటం, ఇప్పుడు ఈ భేటీ.. మొత్తానికి బిజెపి ఏదైనా అనుకుంటే.. ఎంత వరకైనా వెళుతుంది అనడానికి ఇదే ఉదాహరణ అంటూ.. సోషల్ మీడియాలో సైతం హాట్‌హాట్‌గా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. భేటీ అనంతరం.. ఈ భేటీపై స్పందిస్తూ.. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.