Advertisementt

విడుతలై 2 పార్టు లుగా..

Mon 22nd Aug 2022 12:24 AM
vijay sethupathi,soori,vetrimaaran,viduthalai  విడుతలై 2 పార్టు లుగా..
Vetrimaaran Viduthalai to be made in 2 parts!! విడుతలై 2 పార్టు లుగా..
Advertisement
Ads by CJ

నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వాతియర్ గా, సూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం విడుతలై. ఆర్.ఏస్ ఇన్ఫో్టైన్మెంట్ మరియు రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై ఎల్డ్రడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.

మొదలు పెట్టినప్పటి నుండి అనూహ్యమైన స్పందన ని అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కడం దీనిని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై సమర్పించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అద్భుతమైన నటీనటులు సాంకేతిక బృందం తో విడుతలై మొదటి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రెండో భాగంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలున్నాయి. ఖర్చు కి వెనకాడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ పరిశ్రమలో ఇప్పటివరకు తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. కళా దర్శకుడు జాకి నేతృత్వంలోని కళా బృందం 10 కోట్ల విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించగా ఇటీవల సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యం లో భారీ సెట్ ని నిర్మించారు. ప్రస్తుతం యాక్షన్ కోరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకనాల్  లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడు కి వచ్చిన నిష్ణాతులైన స్టంట్ బృందం పాల్గొనున్నారు.

విజయ్ సేతుపతి, సూరి తో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు ఇతర అగ్ర తారలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Vetrimaaran Viduthalai to be made in 2 parts!!:

Vijay Sethupathi, Soori - Vetrimaaran Viduthalai to be made in 2 parts!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ