Advertisementt

బాయ్‌కాట్.. ‘లైగర్’ని కూడా తాకింది

Sun 21st Aug 2022 04:21 PM
liger,vijay deverakonda,boycott,social media,puri jagannadh,karan johar,ananya pandey,boycott liger  బాయ్‌కాట్.. ‘లైగర్’ని కూడా తాకింది
Liger Movie Boycott Trend Creates Sensation బాయ్‌కాట్.. ‘లైగర్’ని కూడా తాకింది
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మేకర్స్ గుండెల్లో గుబులు మొదలవుతుంది. కారణం నెటిజెన్స్ సోషల్ మీడియాలో బాలీవుడ్ మూవీస్‌పై విషం చిమ్ముతున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా రిలీజ్‌కి ముందు సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే #BoyCottBollywood హాష్ ట్యాగ్స్‌తో పాటుగా ఆయా మూవీస్ హాష్ ట్యాగ్స్‌ ట్రెండ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, శంషేరా ఇలా ఏ మూవీని వదలడం లేదు.. ఎప్పుడో రిలీజ్ కాబోయే విక్రమ్ వేద, బ్రహ్మాస్త్ర మూవీస్‌ని కూడా బాయ్ కాట్ చేయాలంటూ నిరసనలు తెలుపుతున్నారు.

 

తాజాగా ఈ సెగ ఇప్పుడు ‘లైగర్’ని తాకింది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ ఈ గురువారం రిలీజ్ కాబోతోంది. అయితే ‘లైగర్’ సౌత్ మూవీ అయినా.. పూరి జగన్నాధ్ ఈ సినిమాకి నిర్మాతగా ఉండడం, అలాగే బాలీవుడ్ కరణ్ జోహార్ మరో నిర్మాత కావడంతో ఇప్పుడు నెటిజెన్స్ సెగ ‘లైగర్’ మూవీని తాకింది. అనన్య పాండే బాలీవుడ్ హీరోయిన్ అవడం, కరణ్ జోహార్ బాలీవుడ్ వాళ్ళే కావడంతో #BoyCottLigerMovie అంటూ హాష్ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి తెచ్చారు. మరి అన్ని సినిమాల వలే ‘లైగర్’ కూడా ఈ నెగిటివిటీని ఫేస్ చేయాల్సిందేనా.. అనేది ఇప్పుడు సౌత్ ప్రేక్షకుల ముందున్న ప్రశ్న.

Liger Movie Boycott Trend Creates Sensation:

Netizens Starts Boycott Trend on Liger movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ