Advertisementt

నా నుండి క్విక్ ప్రాజెక్ట్స్ ఉండవ్: పూరి

Sun 21st Aug 2022 10:42 AM
puri jagannadh,liger,temper,pokiri,quick projects,tollywood director,puri  నా నుండి క్విక్ ప్రాజెక్ట్స్ ఉండవ్: పూరి
Puri Jagannadh About His future Movies నా నుండి క్విక్ ప్రాజెక్ట్స్ ఉండవ్: పూరి
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ అంటే సినిమాని చాలా స్పీడు‌గా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేస్తాడని, అలాగే హీరోలని మాస్ స్టయిల్‌లో ప్రెజెంట్ చెయ్యడం పూరి మార్క్ కనిపిస్తుంది అని, పూరి జగన్నాధ్ డైలాగ్స్‌కి స్పెషల్ ఫాన్స్ కూడా ఉంటారని, హీరోలతో చెప్పించే డైలాగ్ అంతలా యూత్‌లోకి వెళతాయని అంటుంటారు. పూరి దర్శకత్వలో వచ్చిన పోకిరి, టెంపర్ లాంటి సినిమాలు ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కొన్ని సినిమాలలో పూరి మార్క్ మాస్ ఎక్కువవడంతో తేడా కొట్టిన సందర్భాలు చాలా ఎక్కువే ఉన్నాయి.

 

అయితే తాజాగా ఆయన నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో మాత్రం పూరి మార్క్ డైలాగ్స్ లేవు.. కారణం విజయ్ దేవరకొండ కేరెక్టర్‌కి పెట్టిన నత్తి. అందుకే అక్కడ డైలాగ్స్ ఎక్కువగా వినిపించవనిపిస్తుంది. అయితే ఎప్పుడూ క్విక్‌గా సినిమాలని పూర్తి చేసే పూరి.. ఇటు పాన్ ఇండియా మూవీ, అటు కోవిడ్ వలన ‘లైగర్’ మూవీ షూటింగ్‌కు చాలా సమయం తీసుకున్నాడు. ఇకపై తన నుండి క్విక్‌గా ప్రాజెక్ట్స్ రావని క్లారిటీ ఇచ్చేశాడు పూరి జగన్నాధ్.. తన ‘లైగర్’ ప్రమోషన్స్‌లో. ఇకపై అన్నీ టైం తీసుకొనే ప్రతిదీ మంచి సినిమా చేస్తానని తెలిపాడు. దీనితో అయితే పూరి జగన్నాథ్ నుండి ఇక నుండి హిట్ సినిమాలనే ఆశించవచ్చేమో.

Puri Jagannadh About His future Movies:

No More quick projects from me says Puri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ