హీరోయిన్ రాశీ ఖన్నాకి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్‌తో టాలీవుడ్ షాకిచ్చింది. అందులో గోపీచంద్‌తో కలిసి నటించిన ‘పక్కా కమర్షియల్’ ఒకటి కాగా.. రెండోది నాగ చైతన్య ‘థాంక్యూ’. బరువు తగ్గి గ్లామర్ పెంచి మ్యాగ్జిమమ్ అందాల ఆరబోతతో ఈ రెండు సినిమాల్లో రాశి ఖన్నా రెచ్చిపోయింది. కానీ ఆమె ఎంతగా గ్లామర్ ఒలకబోసినా రెండు సినిమాలు డిజాస్టర్ అవడంతో రాశీ ఖన్నాకి పని జరగలేదు. ఇప్పుడు తమిళనాట మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ పాపకి లక్కు కలిసొస్తుందో లేదో కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాశీ ఖన్నా చేసే గ్లామర్ రచ్చ ఓ రేంజ్‌లో ఉంది.
బాలీవుడ్‌లో ‘రుద్ర’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫొటోస్‌లో అందాల ఆరబోతలో వేరే లెవెల్ చూపించింది. వైట్ డ్రెస్‌లో రాశి ఖన్నా చూపించాల్సిన అందాలని చాలా అందంగా చూపించింది. క్లివేజ్ షో చేస్తూ రాశి ఖన్నా లూజ్ హెయిర్‌తో ఇచ్చిన భంగిమకి యూత్ ఫిదా కావడమే కాదు.. గుండె జారి గల్లంతవడం ఖాయం. వైట్ టాప్, వైట్ ప్యాంట్‌తో రాశి ఖన్నా ఇచ్చిన అందమైన పిక్స్‌పై మీరు ఓ లుక్కెయ్యండి.