Advertisementt

మాస్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్

Fri 19th Aug 2022 07:42 PM
bigg boss6,bigg boss season 6 telugu,nagarjuna  మాస్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్
Bigg Boss season 6 new promo viral మాస్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందు యాజమాన్యంతో పాటుగా నాగార్జున కూడా ట్రై చేస్తున్నారు. నిన్నగాక మొన్న బిగ్ బాస్ ప్రోమో తో సీజన్ సిక్స్ సెప్టెంబర్ 4 నుండి మొదలు కాబోతుంది అంటూ నాగార్జున చాలా స్టైలిష్ గా కన్పించి చెప్పారు. మరో పదిహేను రోజుల్లో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ సిక్స్ పై మరింత హైప్ పెంచేందుకు మరో ప్రోమోని వదిలారు. ఆ ప్రోమోలో నాగార్జున మాస్ గా మోడ్రెన్ గా ఎంట్రీ ఇచ్చారు. వీధిలో అందరూ క్రికెట్‌ ఆడుతున్నారు. ఇంతలో సడన్‌గా బౌలర్‌ బంతి పట్టుకుని ఉరుక్కుంటూ నేరుగా ఇంట్లోకి దూరిపోయాడు.

అందరూ ఆశ్చర్య పోవడమే కాదు.. వాళ్ళు క్షణాల్లో మాయమైపోయారు. ఒక్క క్రికెటర్‌ తప్ప. వెంటనే నాగార్జున మాస్ గా ఎంట్రీ ఇవ్వడమే కాదు.... అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా.. ఇక్కడ ఆట ఆగిందంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్లే.. అంటూ మాస్ గా చెప్పిన డైలాగ్ తో వచ్చిన బిగ్ బాస్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Bigg Boss season 6 new promo viral:

Bigg Boss season 6 new promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ