బాలకృష్ణ అఖండతో ఎంత పెద్ద హిట్ కొట్టారో తెలిసిందే. డిసెంబర్ 2 న విడుదలైన అఖండ మూవీ మాస్ ఆడియన్స్ ని విజిల్స్ వేయించింది. థమన్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ లవర్స్ నే కాదు సినిమా లవర్స్ ని ఊపేసింది. బాలయ్య విశ్వరూపం, బోయపాటి మేకింగ్, థమన్ మ్యూజిక్ అన్ని అఖండ హిట్ లో భాగమయ్యాయి. అయితే ఇప్పుడు డిసెంబర్ మొదటి వారంలోనే బాలయ్య తదుపరి మూవీ NBK107 మూవీ ని రిలీజ్ చెయ్యాలనే ప్లాన్స్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలయ్య తో చెయ్యబోయే NBK107 మూవీని దసరా బరిలో నిలుపుదామనుకున్నా గత 20 రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం, దసరా మరొక్క నెల మాత్రమే ఉండడంతో ఇప్పుడు దసరా ప్లాన్ చేంజ్ చేసి డిసెంబర్ లో అఖండ సెంటిమెంట్ ని ఫాలో అవ్వాలని చూస్తున్నారట.
ప్రస్తతం NBK107 టీం టర్కీ వెళ్లే ప్లాన్ లో ఉంది. తదుపరి షెడ్యూల్ కోసం NBK07 టీం ఈ నెల 24 టర్కీకి వెళ్లబోతుంది. అమెరికా వెళ్లాల్సిన టీం అక్కడ వీసా ప్రోబ్లెంస్ ఉండడంతో.. ఇప్పుడు టర్కీ లో ఏ షెడ్యూల్ కంప్లీట్ చెయ్యబోతున్నారు. టర్కీ లో NBK 107 లోని కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసి.. తరవాత మిగతా షూటింగ్ హైదరాబాద్ లోనే ముగించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూడు నెలలో పూర్తిగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి డిసెంబర్ లో కూల్ గా థియేటర్స్ లోకి వచ్చి అఖండ వంటి పవర్ ఫుల్ హిట్ కొట్టాలని చూస్తున్నారట.