ఓ వైపు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తూ - మరోవైపు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతూ అంతటా హాట్ టాపిక్ గా నిలుస్తోంది లైగర్ మూవీ. ఆగస్ట్ 25 న విడులయ్యేందుకు అన్ని విధాలా సంసిద్ధమై ఉన్న లైగర్ సినిమా కోసం ఆగస్ట్ 20 వ తేదీన గుంటూరులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు భారీ యెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ సంగతలా ఉంచితే లైగర్ టీమ్ డాషింగ్ జోష్ ని డబుల్ చేసేలా తమ వేదికపై లైగర్ ఎమోజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ట్విట్టర్. ఇది తెలియగానే మరింత రెచ్చిపోతోన్న VD ఫాన్స్ వరుస ట్వీట్లతో ట్విట్టర్ ని షేక్ చేయడం స్టార్ట్ చేసారు.
అన్నట్టు అపుడెపుడో సాహో సినిమాకి ప్రభాస్ ఎమోజీని, మొన్నామధ్య సర్కారు వారి పాట రిలీజ్ టైమ్ లో మహేష్ బాబు ఎమోజీని అందించిన ట్విట్టర్ ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ తరువాత ఎమోజీకై కన్సిడర్ చేసింది విజయ్ దేవరకొండనే కావడం విశేషం.
మరి ఇప్పుడే ఈ రేంజ్ క్రేజ్ తో సందడి చేస్తోన్న మన రౌడీ స్టార్ రేపు లైగర్ కనుక బ్లాక్ బస్టర్ అయితే ఇంకెంతటి స్థాయికి చేరుకొని ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో... !