శ్రీదేవి కూతురు ఎప్పుడెప్పుడు సౌత్ కి ఎంట్రీ ఇస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా సౌత్ లో మంచి స్క్రిప్ట్ దొరికితే సినిమా చెయ్యడానికి సిద్దమే అంది. అయితే తాజాగా లైగర్ మూవీ ఛాన్స్ జాన్వీ కపూర్ కే రావాల్సిందట. కానీ జానీ కపూర్ కి డేట్స్ ఖాళీ లేనందువలన జాన్వీ కపూర్ ప్లేస్ లోకి అనన్య పాండే వచ్చినట్లుగా లైగర్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం చూసిన శ్రీదేవి అభిమానులు అయ్యో మంచి ఛాన్స్ జాన్వీ కపూర్ చెయ్యి జారీ పోయిందే అని ఫీలైపోతున్నారు. పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేద్దామని షూట్ మొదలు పెట్టినప్పుడు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారట. జాన్వీ కపూర్ ని సంప్రదించగా.. ఆమె డేట్స్ ఖాళీ లేవని చెప్పిందట.
నేను శ్రీదేవి అభిమానిని. ఆమె కూతురు నా సినిమా ద్వారా సౌత్ కి పరిచయం అవడం నా అదృష్టం అనుకున్నాను కానీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మరో హీరోయిన్ ని చూడాల్సి వచ్చింది. అదే విషయాన్ని లైగర్ మరో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో మాట్లాడగా.. అయితేసరే జాన్వీ కపూర్ ఖాళీ లేకపోతే అనన్య పాండే ని పెడదామని చెప్పడంతో లైగర్ ప్రాజెక్ట్ లోకి అనన్య పాండే వచ్చింది అని, విజయ్ దేవరకొండ తో అనన్య జోడి బావుంది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి జగన్నాధ్.