Advertisementt

కీర్తి సురేష్ బోల్డ్ లుక్

Thu 18th Aug 2022 10:30 AM
keerthy suresh,keerthy suresh bold look,keerthy suresh new look viral  కీర్తి సురేష్ బోల్డ్ లుక్
Keerthy Suresh Bold Look కీర్తి సురేష్ బోల్డ్ లుక్
Advertisement
Ads by CJ

మహానటి నుండి గ్లామర్ గా టర్న్ అయిన కీర్తి సురేష్ కళావతిగా కళకళలాడుతుంది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ షో కి అందరూ షాకయ్యారు. తర్వాత కూడా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో గ్లామర్ డ్రెస్సులతో చెలరేగిపోయి ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది పెంపుడు పెట్ తో ఆడుతూ పాడుతూ ఉండే కీర్తి సురేష్ తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా భోళా శంకర్ లో నటిస్తుంది. అలాగే నాని తో దసరా మూవీలో కనిపిస్తుంది. అయితే ఈ మధ్యన కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అని, ఆమె చేసుకోబోయే వరుడు విషయంలోనూ చాలా ప్రచారం జరిగింది.

ఆ విషయంలో కీర్తి సురేష్ స్పందించకపోయినా.. ఫోటో షూట్స్ విషయంలో మాత్రం కీర్తి సురేష్ రోజు రోజుకి గ్లామర్ పెంచేస్తుంది. ఈ మధ్యన సినిమాల కన్నా ఫోటో షూట్స్ తో హైలెట్ అవుతున్న కీర్తి సురేష్ తాజాగా చేయించుకున్న ఫోటో షూట్ లో ట్రెండీ గా, బోల్డ్ గా కనిపించి షాకిచ్చింది. మెడ నిండా మోడరన్ నగలతో, లూజ్ హెయిర్ తో.. ఎల్లో కలర్ బ్లేజర్ లో మెరిసిపోతుంది. నిజంగా మహానటేనా ఈ అమ్మాయి అనుకునేలా ఉంది. మరి మీరు కీర్తి సురేష్ బోల్డ్ లుక్ ని ఓ లుక్కెయ్యండి.

Keerthy Suresh Bold Look:

Keerthy Suresh Bold Look goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ